Home తాజా వార్తలు పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం..

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం..

suicide attempt

 

మహబూబాబాద్: గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారంటూ బెదిరించడంతో ఓ మహిళ పురుగుల మందు తాగిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఈశాల ధనుంజయ, పద్మల పెద్ద కొడుకు నాగేష్ నాలుగు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే వీరిద్దరు కొద్ది రోజులు వేరే ప్రాంతంలో సహజీవనం చేసి, తరువాత తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో యువతి తన పుట్టింటికి వెళ్లింది. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు గ్రామా పెద్దలను ఆశ్రయించి, గ్రామంలో పంచాయతీ నిర్వహించారు.

గ్రామపెద్దలు ఇరు కుటుంబాలను పిల్పించి మాట్లాడి, అబ్బాయి కుటుంబానికి 4 లక్షల రూపాయాలు జరిమాన విధించారు. అయితే గ్రామా పెద్దలు తీర్పు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్న అబ్బాయి కుటుంబం డబ్బులు చెల్లించలేదు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి అబ్బాయి ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వలంటూ ఆ కుటుంబంపై ఒత్తిడి చేశారు. గ్రామ పెద్దల ఒతిడి తట్టుకోలేక మనస్థాపానికి గురైన అబ్బాయి తల్లి పద్మ వారి ముందే పురుగుల మందు తగ్గింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటిన స్థానిక దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందాని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman committed suicide attempt in mahabubabad