Friday, April 26, 2024

బిజెపి నేత రఘునందన్ రావుపై లైంగిక దాడి ఆరోపణలు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తనపై సిద్ధిపేట జిల్లా బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు లైంగిక దాడికి పాల్పడినట్లు మెదక్ జిల్లా ఆర్ సిపురానికి చెందిన రాధారమణి అనే మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై జరిగిన లైంగిక దాడిపై రాధారమణి సోమవారం సైబరాబాద్ సిపి సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేసింది. 2007లో రఘునందన్ రావు కాఫిలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేసినట్లు రాధారమణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైన చెబితే అశ్లీల చిత్రాలు బయటపెడతానని బెదరించాడని, అప్పటి నుంచి బ్లాక్ మేల్ చేస్తూ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. గతంలోనే హెచ్ఆర్ సిని ఆశ్రయించానని.. దీంతో రఘునందన్ రావుపై కేసు నమోదు చేయాలని గత నెలలోనే హెచ్ఆర్ సి ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. తన భర్తతో విభేదాలు రావడంతో 2003లో విడాకుల కోసం అడ్వకేట్ అయిన రఘునందన్ రావు సంప్రదించినట్లు రాధారమణి పేర్కొంది.

కాగా, 2001 నుంచి 2013 వరకు టీఆర్ఎస్‌లో కొనసాగిన రఘునందన్ రావు.. చంద్రబాబును కలిశారన్న ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన బిజెపిలో చేరి.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

Woman Complaints to CP Sajjanar on BJP Leader

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News