Home తాజా వార్తలు భర్త మందలింపు.. ప్రియుడి ఇంటి ముందు మహిళ ధర్నా

భర్త మందలింపు.. ప్రియుడి ఇంటి ముందు మహిళ ధర్నా

Woman Dharna

 

నిజామాబాద్ : భర్త ఇంటి నుంచి గెంటివేయడంతో భార్య ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వళ్తే.. ఓ వివాహిత ఓ మ‌యాగాడు విసిరిన వ‌ల‌లో ప‌డి బ‌లైంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహిత భ‌ర్త దుబాయిలో ఉంటున్నాడు. అయితే ఇదే ఆదనుగా భావించిన ఓ వ్యక్తి బాధితురాలిని లొంగదీసుకున్నాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వాటిని చూపి బెదిరించి డబ్బులు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఇదే విష‌యం భర్తకు తెలియడంతో ఇంట్లో నుంచి భర్త వెళ్లగొట్టాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు సదరు మహిళ సంఘాలతో కలిసి ధర్నాకు దిగింది.. త‌న‌ను మోసం చేసిన వ్యక్తిని శిక్షించి త‌న‌కు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది.

 

Woman Dharna in front of Boyfriend’s house