Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Woman Died In Road Accident In East Godavari At APతూర్పు గోదావరి: కోరుకొండ మండల పరిధిలోని బొల్లెద్దుపాలంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొల్లెద్దుపాలంకు చెందిన పానంపూడి సునీత (29) తన భర్త జయకుమార్‌తో కలిసి రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు  బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో జొన్నాడ వద్ద బైక్‌పై నుంచి సునీత కింద పడిపోవడంతో  తీవ్ర గాయాలపాలైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. పోస్టుమార్టం కోసం సునీత మృతదేహాన్ని ఆలమూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆల మూరు పోలీసులు తెలిపారు.