Wednesday, April 17, 2024

తల్లి, చెల్లిని చంపిన లేడీ డాక్టర్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Woman doctor kills mother and sister with injection

సూరత్ : కుటుంబం లోని తల్లి, చెల్లి, సోదరుడు, వదిన వీరంతా తన సంపాదన పైనే ఆధారపడడంతో విసుగెత్తిన లేడీ డాక్టర్ రెండు ప్రాణాలను బలిగొంది. అంతేకాదు తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. గుజరాత్ లోని చౌక్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాటర్‌గామ్ ప్రాంతం సహజానంద సొసైటీలో నివసిస్తున్న లేడీ డాక్టర్ దర్శన తన కుటుంబం లోని తల్లి, చెల్లి, సోదరుడు, వదినలను పోషించేభారంతో జీవితంపై వినుగెత్తింది. దీంతో ఆమె డ్రగ్స్ ఇంజెక్షన్లను తన తల్లికి, చెల్లికి ఇచ్చి తరువాత తాను నిద్రమాత్రలు ఎక్కువగా చేసుకుంది. తల్లీ చెల్లి చనిపోయారు. ఆ సమయంలో అన్న సోదరుడు, వదిన ఆ సమయంలో లేరని తెలుస్తోంది. డాక్టర్ దర్శన తల్లి మంజులా బెన్, చెల్లి ఫల్గుణి చనిపోయారు. సివిల్ ఆస్పత్రిలో డాక్టర్ దర్శనకు వైద్య చికిత్స జరుగుతోంది. ఆమె వాంగ్మూలాన్ని ఆస్పత్రిలో పోలీసులు నమోదు చేశారని అసిస్టెంట్ పోలీస్‌కమిషనర్ డిజె చావ్డా విలేఖరులకు చెప్పారు. తల్లి, చెల్లి తనపై ఆధారపడడంతో తాను విసుగెత్తి ముందు వారిని చంపి తరువాత తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని డాక్టర్ దర్శన చెప్పినట్టు పోలీసులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News