Home జాతీయ వార్తలు మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన డాక్టర్ (వైరల్ వీడియో)

మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన డాక్టర్ (వైరల్ వీడియో)

Woman-Assaultedభోపాల్: మధ్యప్రదేశ్ గౌలియార్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగినికి డ్యూటీ డాక్టర్ చేయి చేసుకున్నాడు. ఆసుపత్రి సిసిటివి కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో… డ్యూటీ డాక్టర్ గౌరవ్ శర్మ, ఆసుపత్రి రిసెప్షన్ డెస్క్‌ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న గీతా దీక్షిత్ తో వాదనకు దిగాడు. దీంతో ఆమె తన డెస్క్‌ను విడిచిపెట్టి వెళ్లింది. తాను మాట్లాడుతుంటే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కోపోద్రిక్తుడై డాక్టర్ శర్మ ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో అప్రమత్తమైన ఇతర సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman Employee Assaulted by Male Doctor in MP

Courtesy by Latestly