Home ఆఫ్ బీట్ వీడియోలు షాకింగ్ వీడియో… గర్భిణి అరణ్య రోదన

షాకింగ్ వీడియో… గర్భిణి అరణ్య రోదన

ఆంధ్రప్రదేశ్: విజయ నగరం జిల్లాలో వర్షాకాలంలో చుట్టూ వాగులు, వంకలు, కొండలూ, కోనల నడుమ గర్భిణుల ఆర్తనాదాలు, అప్పుడు మంత్రసానే దేవుడు. వారివి తాడు బొంగరం లాంటి జీవితాల్లా మారిపోయాయి. అటువంటి సందర్భంలో జోలెకట్టి కావడి వేసుకొని వాగుల గుండా మోసుకొచ్చిన సందర్భాలు ఎన్నో. సరైన రోడ్డు సౌకర్యం లేక ఎడ్ల బండ్ల మీద ఆరోగ్య కేంద్రానికి తరలించే క్రమంలో అడవిలో నొప్పు లతో అనారోగ్యంతో ప్రసవించిన వారు ఎందరో. గిరిజన తండాలలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆమె బంధువులు, స్థానికుల భుజాలపై  ఆమెను కొంతదూరం మోసుకెళ్లారు. కానీ నొప్పులు ఎక్కువగా రావడంతో మార్గం మధ్యలో ఆమె ప్రసవించింది. తల్లి, బిడ్డకు ఉండే పేగును తెంచడానికి పెంకును వాడారు. ఈ ఘటన చూస్తే ఇంకా భారత దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. పేదవాడికి సరైన సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉండి ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఎవరైనా నమ్మగలరా  ఎన్ని ప్రభుత్వాలు మారినా పేద ప్రజల బతుకులు మారడం లేదు. … పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని..గ్రామ స్వరాజ్యం సాధిస్తేనే గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు, రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎందరో మహానుభావులు చెప్పినా పట్టించుకునే నాథుడే లేడు.  స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నా అడవి బిడ్డల తలరాతలు మారడం లేదు. అడవులనే ఆవాసాలుగా చేసుకుని జీవిస్తున్న గిరిపుత్రులకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. రోడ్డు సదుపాయాలు, విద్య, వైద్య అవసరాలు లేక నేటికి గిరి పుత్రులు ఇబ్బందులు పడుతున్నారు.