Home తాజా వార్తలు ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు

ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు

Kidsమహబూబాబాద్‌ : ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్‌ మండల పరిధిలోని రెడ్యాల శివారు సికింద్రాబాద్‌ తండాకు చెందిన బానోతు సురేశ్‌-రాజేశ్వరికీ నాలుగేళ్ల కిందట పెళ్లి అయింది. పురిటినొప్పులతో రాజేశ్వరీ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు సుఖప్రసవం జరిగి ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. ముగ్గురిలో ఇద్దరు పిల్లల బరువు తక్కువగా అనారోగ్యంగా ఉండడంతో వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. తల్లి, మరో మగ పిల్లాడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎంజిఎం ఆస్పత్రిలో మిగిలిన ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారని,వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

Woman Give Birth Three Female Kids At Mahabubabad