Home జాతీయ వార్తలు అత్తివరద వేడుకలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

అత్తివరద వేడుకలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

 

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో అత్తివరద పెరుమాళ్ వేడుకలలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 40 సంవత్సరాల ఒకసారి జరిగి అత్తివరద జాతరకు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. వేలూరు జిల్లాలోని బనవరం గ్రామానికి  చెందిన విమళ-ఆశోక్ కుమార్ అనే దంపతులు దేవుని దర్శనం కోసం దేవరాజస్వామి గుడికి వచ్చారు. అప్పడికే శ్రీ దేవరాజస్వామి గుడి  భక్తులతో కిటకిటలాడుతోంది. విమళ గర్భణీగా ఉండడంతో పోలీసులు ప్రత్యేక లైన్ ద్వారా దర్శనభాగ్యం కల్పించారు. అత్తివరద స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం గుడి అవరణంలో దంపతులు విశ్రాంతి తీసుకుంటుండగా ఆమె నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆ దంపతులు  చేరుకున్నారు. పరీక్షించిన వైద్యులు ప్రసవం చేయాలని ఆమెకు సూచించారు. పండంటి బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చిందని, సుఖప్రసవమైందని డాక్టర్ జాన్సీరాణి వెల్లడించారు. వెంటనే తల్లిని, బిడ్డను కాంచీపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  దీంతో ఆమె బంధువులు బిడ్డను చూడటానికి కాంచీపురం వస్తున్నారు. ఆ దంపతులు తమ బిడ్డ పేరు అత్తివరధర్ అని పెట్టుకున్నారు. 40 సంవత్సరాలకు ఒక సారి ఈ వేడుకలు కావడంతో వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. హైకోర్టు సూచనల మేరకు వృద్ధులకు, గర్భిణీలకు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, తదితరులు అత్తివరద స్వామిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు 48 రోజుల పాటు జరుగుతాయి. అత్తివరద వేడుకలు జులై-1 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్నాయి.

Woman gives Birth to boy at Athi Varadar festival