Wednesday, April 24, 2024

ఒకవైపు సింహాల గర్జన… నడిరాత్రి కారడవిలో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

- Advertisement -
- Advertisement -

born

గాంధీనగర్: నడిరాత్రి కారడవిలో ఒక వైపులో సింహాల గర్జన మరో వైపు అంబులెన్స్‌లో ఓ గర్భిణి ముగ్గురు మగ బిడ్డలకు జన్మనిచ్చింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం రోజున గిర్ ఫారెస్ట్‌లో పండంటి బిడ్డలకు మాతృమూర్తి జన్మనిచ్చింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా ఖంభా తాలూకాలోని దాదాన్ గ్రామంలో దయా, నర్సి బరియా అనే దంపతులు ఉండేవారు. దయా తొమ్మిది నెలల గర్భిణీ. ఆదివారం రాత్రి దయాకు పురటి నొప్పులు రావడంతో ఆమె భర్త నర్సి 108కు ఫోన్ చేశాడు. ఎమర్జెన్సీ కేసు ఉందని గోవింద్ బంభానియా అనే నర్సు అంబులెన్స్ డ్రైవర్ రాజు బోరిసాగర్‌కు దాదాన్ గ్రామానికి వెళ్లాలని సూచించింది.

అంబులెన్స్ ఆ గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్తుండగా 18 సింహాలు అంబులెన్స్ దారికి అడ్డుగా కన్పించాయి. ఒక వైపు పురటి నొప్పులతో గర్భిణీ తల్లడిలుతోంది…. మరోవైపు సింహాలు గర్జిస్తున్నాయి. డ్రైవర్ రాజుకు ఏం చేయాలో తోచడం లేదు. ఆస్పత్రి వెళ్లే వరకు కష్టమేనని ఇక్కడనే కాన్పు చేయాలని నర్సు గోవింద్ బాంభానియా తన డ్రైవర్‌కు తెలిపింది. వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపి గైనకాలజిస్ట్‌కు ఫోన్ చేశాడు.

కారాడవిలో నడి రాత్రి ఒక వైపు సింహాల గర్జన మరోవైపు గర్భిణి పురటి నొప్పులలో బాధపడుతోంది. గైనకాలజిస్ట్ సూచినలతో ఆ నర్సు గర్భిణికి సుఖ ప్రసవం చేసింది. ఈ కాన్పులో ముగ్గురు మగ బిడ్డలు జన్మించారు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ తల్లి మనో నిబ్బరానికి తాను ఫిదా అయ్యానని నర్సు ప్రశంసించింది. దేవుడిలా వచ్చి తన భార్య , బిడ్డలను బతికించారని నర్సు, అంబులెన్స్ డ్రైవర్‌కు ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపాడు. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని పరీక్షించిన  వైద్యులు తెలిపారు.

 

born

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News