Thursday, April 25, 2024

మాయా కి‘లేడీ’ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Woman held for matrimonial fraud at Hyderabad

మాట్రిమోని సైట్లలో నకిలీ పోస్టులతో బురిడి

హైదరాబాద్ : వివాహం పేరుతో పలువురికి వల విసురుతూ మోసాలకు పాల్పడుతున్న మాయలేడీని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షల 16 వేల నగదుతో పాటు ల్యాప్‌టాప్, 4 సెల్‌ఫోన్‌లు, 4 ఎటిఎం కార్డులు, 7 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన స్వాతి శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీలో ఎంబిఎ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న స్వాతి గత కొంతకాలంగా ఘట్‌కేసర్‌లోని పోచారంలో నివసిస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు అడ్డదారులు ఎంచుకుంది. ఇందులో భాగంగా సులభంగా డబ్బు సంపాదించాలని భావించి మాట్రిమోని సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్స్ పోస్టు చేయడం ఆరంభించింది. కాగా స్వాతి గతంలోనూ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలువురిని మోసం చేసిన కేసుల్లో అరెస్ట్ కావడంతో పాటు జైలుకు వెళ్లింది.

విదేశాల్లో స్థిరపడిన వారినే వివాహం చేసుకుంటానని ప్రకటనలు ఇవ్వడం, ఆపై ఆ ప్రకటనలను చూసి స్పందించే వారితో రకరకాల గొంతులను అనుకరించి మాట్లాడి మోసాలకు పాల్పడటంతో స్వాతి ఆరితేరిందని పోలీసులు పేర్కొంటున్నారు. యాడ్‌కామ్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లికి అంగీరించినట్టు ఫోన్‌లో మాట్లాడి ఆపై వారినుంచి డబ్బులు గుంజడం మొదలు పెడుతుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. వారితో వివాహానికి డబ్బులు డిమాండ్ ఆపై వారి నుంచి వసూలు చేసి ఆ తర్వాత వారితో సంబంధాలను కట్ చేస్తుందని పోలీసులు వివరించారు. బాధితులు ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతి ఆధారాల ద్వారా ఆమెను గుర్తించి అరెస్టు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News