ఇది మహిళా శక్తి అంటే… మహిళలంతా తమలో దాగున్న శక్తిని బయటికి తీస్తే… రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. ఆడవాళ్లపై జరిగే దాడులకు అడ్డు కట్ట వెయ్యాలంటే ఇటువంటి సంఘటనలు జరగాల్సిందే.
కేరళ లోని కొచ్చి కి చెందిన ఓ మహిళ కు రిపీటెడ్ గా ఓ రోజు అన్ నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయట. చాలా సార్లు వచ్చినా తను ఎత్తలేదట. ఇక ఫోన్ కాల్స్ బాధ తట్టుకోలేక… తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేసిందట.
అప్పుడు అటువైపు ఉన్న వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి.. రేట్ ఎంత అని అడిగాడట. అంతే కాదు.. తన ఫోటో, రేట్, ఫోన్ నెంబర్ అన్ని వాట్సాప్ లో ఉన్నాయని.. అందుకే తాను కాల్ చేశానని ఆ వ్యక్తి చెప్పాడట.
దీంతో ఆరా తీసిన ఆ మహిళ… ఆమె వివరాలు ఓ పార్టీకి చెందిన యూత్ వింగ్ ఆధ్యక్షుడు పెట్టాడని తెలుసుకొని అతడిని కలిసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిందట. అసలే మనోడు పార్టీ లీడర్… ఎందుకు చెప్తాడు సారీ.. మనోడు మొండికేయడంతో.. ఆ పార్టీ పెద్దకు మనోడి సంగతి చెప్పిందట.
మనోడిని యూత్ వింగ్ అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని ఆ పార్టీ పెద్దను కోరిందట. దీంతో ఆ లీడర్ తండ్రి… మహిళ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాడట. అయినప్పటికీ సంతృప్తి చెందని ఆ మహిళ ఏదైనా ఎన్జీవో కు రూ. 25000 డొనేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. అలా అయితేనే దీన్ని వదిలేస్తానని.. లేదంటే లీగల్ గా వెళ్తానని ఖరాఖండిగా చెప్పేసిందట.
దిక్కుతోచని స్థితిలో ఆ లీడర్ తండ్రి ఓ ఎన్జీవోకు రూ. 25000 డొనేట్ చేసి రిసీప్ట్ ఇచ్చాక గాని శాంతించలేదట ఆ మహిళ. ఇక, ఈ విషయాలన్నింటినీ… తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసుకుంది. ఇక చూసుకోండి.. అంతే.. అప్పటినుంచి ఈ పోస్టే సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్.