Home ఆంధ్రప్రదేశ్ వార్తలు విజయవాడ కృష్ణలంకలో విషాదం

విజయవాడ కృష్ణలంకలో విషాదం

woman jumped into canal with two children at vijayawada

అమరావతి: విజయవాడ కృష్ణలంకలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా బందరు కాల్వలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు కాల్వలోకి దూకి ఇద్దరు పిల్లలను కాపాడారు. మహిళ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలానికి నివాసిగా గుర్తించారు. మహిళ ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. తల్లి ఆవేశపూరిత నిర్ణయానికి ఇద్దరు పిల్లలు అనాధలయ్యారని పోలీసులు తెలిపారు.