Home జాతీయ వార్తలు జవాన్ భార్య, కూతురును చంపిన ప్రియురాలు

జవాన్ భార్య, కూతురును చంపిన ప్రియురాలు

Murder

 

 

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ప్రియురాలు ప్రియుడి భార్యను, కూతురిని హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రామ్ తిరేత్ కు కమలేష్ అనే భార్య ఉంది. ఐటిబిపి జవాన్ దేవానంద్‌తో కమలేష్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీళ్ల వివాహేతర సంబంధానికి దేవానంద్ కుటుంబం అడ్డువస్తుండడంతో అంతం చేయాలని కమలేష్ నిర్ణయం తీసుకుంది. దేవానంద్ భార్య సుమన్, కూతురు క్రియా గొంతు పిసికి చంపేసింది. అనంతరం వాళ్ల మృతదేహాలను ప్రితా నగర్‌లో ఉన్న కుంటలో పడేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దేవానంద్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కమలేష్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తనదైన శైలిలో విచారణ జరపడంతో తాను హత్య చేశానని కమలేష్ ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెతో పాటు దేవానంద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Woman kills paramour’s wife, daughter in Amritsar

 

Woman kills paramour’s wife, daughter in Amritsar