Home జాతీయ వార్తలు  ఏవోబీలో ఎదురు కాల్పులు : ముగ్గురు మావోయిస్టులు మృతి

 ఏవోబీలో ఎదురు కాల్పులు : ముగ్గురు మావోయిస్టులు మృతి

Woman Maoist Died In Counter Firing In AOB : ఏవోబీలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. మల్కాన్‌గిరి జిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ  ఎదురు కాల్పుల్లో మహిళ మావోయిస్ట్ సహా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఓ ఎస్ఓజీ జవాన్‌ గాయపడ్డారు. గాయపడిన జవాన్ ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.