Home తాజా వార్తలు వదినను హత్య చేసిన మరిది

వదినను హత్య చేసిన మరిది

Woman Murder In Suryapet Distసూర్యాపేట : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిదిలోని రామాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హత్య కేసులో తనను జైలుకు పంపిందని వదినపై కక్ష పెంచుకున్న మరిది ఆమెను హతమార్చి పొలం వద్ద తగలబెట్టాడు. రామాపురం గ్రామానికి చెందిన రేఖ సైదులు 2004లో తన అన్న రేఖ పిచ్చయ్యను హత్య చేశాడు. ఈ కేసులో సైదులు మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. తన అన్న పిచ్చయ్య హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేకున్నా, కేసులో ఇరికించిందన్న కోపంతో వదిన రేఖ బయమ్మ(55)పై కక్ష పెంచుకున్నాడు. ఈ  క్రమంలో శనివారం అర్ధరాత్రి బయమ్మ తలపై సుత్తితో మోది హత్య చేశాడు. అనంతరం బయమ్మ మృతదేహాన్ని ట్రాక్టర్ లో పొలం వద్దకు తీసుకెళ్లి అక్కడ తగలబెట్టాడు. ఆదివారం ఉదయం సైదులు పోలీసులకు లొంగిపోయాడు. తన వదిన బయమ్మను హత్య చేసినట్టు సైదులు పోలీసుల ఎదుట అంగీకరించాడు. బయమ్మ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ రాఘరావు తెలిపారు.