Home కామారెడ్డి బెంగళూరులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

బెంగళూరులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Woman Software Engineer Commits Suicide In Bengaluruబెంగళూరు : తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన శరణ్య అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. శరణ్య గత ఏడాది కామారెడ్డికి చెందిన రోహిత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన నాటి నుంచి రోహిత్ శరణ్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మూడు మాసాల క్రితం భర్తను వదిలిపెట్టి శరణ్య కామారెడ్డికి వచ్చింది. కోర్టు, కుల పెద్దల జోక్యంతో శరణ్య మళ్లీ బెంగళూరు వెళ్లి భర్తతో కలిసి ఉంటుంది. అయితే రోహిత్ తిరిగి వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన శరణ్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు  మృతికి ఆమె భర్త రోహిత్ వేధింపులే కారణమని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శరణ్య తల్లిదండ్రులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.