Tuesday, April 16, 2024

వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide

హైదరాబాద్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉండే సతీశ్, శ్రీలతకు ఎనిమిది ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరు కల్యాణ్‌పురి టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీలత ఉప్పల్‌లోనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రైవేట్ ఎంప్లాయ్ అయిన సతీశ్ గత కొంతకాలంగా ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే భార్యను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. భర్తతోపాటు అత్తమామలు కూడా సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో మనస్తాపనికి లోనైన శ్రీలత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కూతురు మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. ఆమె కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమారం నిమిత్తం మార్చీురీకి తరలించి కేసు విచారణ చేస్తున్నారు.

 

Woman Software Engineer Suicide In Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News