Home ఖమ్మం వరకట్నంకు యువతి మృతి

వరకట్నంకు యువతి మృతి

Woman Suicide After Partner Rejects Marriage Proposal

 

నేలకొండపల్లి: ప్రేమ, పెళ్ళి మద్య వరకట్నం విషయంలో చివరికి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం మండల పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంకు చెందిన కొక్కిరేణి నాగేశ్వరరావు కూతురు కొక్కిరేణి నాగపూజ(24) మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, గొల్లచర్ల గ్రామంకు చెందిన కొడవండ్ల వెంకన్న కుమారుడు నవీన్‌కుమార్ ఇరువురు కాలేజిలో మంచి స్నేహితులు, క్లాస్‌మెంట్స్, గత నాలుగేళ్ళుగా వారిరువురు ప్రేమించికుంటున్నారని అమ్మాయి తండ్రి కొక్కిరేణి నాగేశ్వరరావు తెలియజేశాడు. వారిరువురికి పెళ్ళి చేసెందుకు తాము నిర్ణయించుకున్నామని, ఈ వివాహ విషయమై మాట్లాడేందుకు నవీన్ కుటుంబ సభ్యులు గత గురువారం చెన్నారం గ్రామంకు వచ్చారు. అయితే ఈ పెళ్ళి జరగాలంటే రూ. 25 లక్షలు వరకట్నం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అందుకు నాగపూజ తల్లిదండ్రులు తాము ఇంత ఇచ్చుకోలేనని చెప్పడంతో చివరికి 10 లక్షలు, మోటర్ సైకిల్, ఉంగరం ఇవ్వాలని చెప్పారన్నారు.

చివరగా అమ్మాయి తల్లిదండ్రులు మేమంత ఇచుకోలేనని రూ 6 లక్షలు వరకట్నంగా ఇస్తానని వారికి చెప్పారు. అందుకు వారు మీ కూతురు మాకు అవసరంలేదని చెప్పి వెళ్ళిపోయారు. దీంతో మనస్థాపానికి గురైన తన కుమార్తె నాగపూజ శనివారం ఇంట్లో ఎవ్వరులేని సమయంలో ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. త్రీవ ప్రాణపాయ స్థితిలో ఉన్న నాగపూజను హుటహుటిన వైద్యం నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. తన కుమార్తె నాగపూజ మృతికి తగిన చర్య తీసుకోవాలని మృతురాలు తండ్రి నాగేశ్వరరావు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ ఎన్ గౌతమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Woman Suicide After Partner Rejects Marriage Proposal