Home Default జుట్టుకు రంగేసుకుందని భర్త వీరంగం.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

జుట్టుకు రంగేసుకుందని భర్త వీరంగం.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

committed suicideగాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం..

హైదరాబాద్,చిలకలగూడ: తెల్ల జుట్టుకు హెయిర్ డై వేసుకున్న భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఎస్‌కే సమీన (28) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిండి. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ ఖాజీపేటకు చెందిన ఎస్‌కే సమీన (28) ఒమర్ భార్యభర్తలు.

వీరికి నలుగురు కుమారులు. ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చి చిలకలగూడ చింతబావిలో ఉంటున్నారు. జుత్తులో తెల్లవెంట్రుకలు కనిపించడంతో సమీర ఈనెల 8న హెయిర్‌డై వేసుకుంది. దీనిని గుర్తించిన ఒమర్ అమెను నిలదీయడంతో పాటు అనుమానం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన సమీన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో సమీన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో ఎస్‌కే సమీన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Woman Suicide Attempt in Chilkalguda Hyderabad