Home తాజా వార్తలు కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం… ప్రియురాలు హత్య?

కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం… ప్రియురాలు హత్య?

Women affair with constable

 

బెంగళూరు: ఓ వివాహిత అనుమానస్పద స్థితిలో చనిపోయిన సంఘటన కర్నాటకలో బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజేశ్వరి(35), వెంకటేష్ (40) అనే దంపతులు ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శిడ్లఘట ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. శిడ్లఘట్ట ప్రాంతంలో అనంత్ కుమార్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి అనంత్ కుమార్ రాజేశ్వరీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నవంబర్ 21న అనంత్ కుమార్-రాజేశ్వరీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే రోజు రాజేశ్వరీ ఇంట్లో శవంగా కనిపించింది. అనంత్ కుమారే హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు, భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు.