Home తాజా వార్తలు కానిస్టేబుల్ చేతిని కొరికి… మెడపై గోళ్లతో గీకి….

కానిస్టేబుల్ చేతిని కొరికి… మెడపై గోళ్లతో గీకి….

 

హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ… పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జహీర్‌నగర్‌లో మద్యం మత్తులో ఓ మహిళ హల్‌చల్ చేస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమెను పిఎస్‌కు తరలించారు. మత్తు వదిలిన తరువాత పిఎస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను నానా బూతులు తిడుతూ… వారిపై దాడి చేయడమే కాకుండా, లేడి కానిస్టేబుల్ చేతిని కొరకడంతో పాటు మరో కానిస్టేబుల్ మెడపై గాట్లు వచ్చే మాదిరిగా గోర్లతో గీకింది. మహిళను పోలీసులు బంధించారు. సదరు మహిళది నాగాపూర్ రాష్ట్రమని, మాదాపూర్ నివసిస్తోందని పోలీసులు వివరించారు. ఆమె బంధువులకు లేక కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని పోలీసులు వెల్లడించారు. ఆమె డ్రగ్స్ తీసుకుందా లేక మద్యం మత్తులో ఉందా అనేది తెలియాల్సి ఉందన్నారు.

 

Women attacked on Constable in Hyd Police Station