Home తాజా వార్తలు తాళి కట్టే ముందు పెళ్లి వద్దని చెప్పిన యువతి…. కారణమేంటో తెలుసా?

తాళి కట్టే ముందు పెళ్లి వద్దని చెప్పిన యువతి…. కారణమేంటో తెలుసా?

Women cancelled her marriage

నాగర్ కర్నూల్:  పది నిమిషాలలో వధువు మెడలో మూడు ముళ్లు పడుతాయి… కానీ తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని యువతి తన వివాహాన్ని రద్దు చేసుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వంకేశ్వర గ్రామానికి చెందిన బద్రు అనే యువకుడితో మర్రిపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చమైంది. ఇరు కుటుంబ సభ్యులు బుధవారం పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. తాళి కట్టే పది నిమిషాల ముందు పెళ్లి కూతురు వివాహం చేసుకోనని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంటర్ వరకు చదువుకున్నానని పై చదువుల కోసం పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో పెళ్లిని ఆపేశారు. వివాహ వేడుక జరిగే స్థలానికి పోలీసులు చేరుకొని ఘర్షణ తలెత్తకుండా చూశారు.