మన తెలంగాణ/జోగిపేట : నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంథోల్, జోగిపేట నగరపంచాయతీ పరిధిలోని 13వ వార్డు ప్రజలు ప్రధానరహదారిపై రాస్తారోకో చేశారు. మంగళవారం పట్టణంలోని 13వ వార్డు ప్రజలు గత కొంత కాలంగా తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులకు పలుసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో వా రు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 13వ వా ర్డు సభ్యురాలు నీటి సమస్యను ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఆ కాలనీ వాసులు ముందుగా రోడ్డుపై బై ఠాయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తా యి. ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చచెప్పి అక్కడి నుం చి పంపించారు. ఆందోళనకారులు నేరుగా నగరపంచయతీ కార్యాలయానికి చేరుకొని గేట్ ముందు మెట్ల పై కూర్చొని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్‌పర్సన్ భర్త సురేందర్‌గౌడ్ అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తానని చెప్పినా వినిపించుకోలేదు. సురేందర్‌గౌడ్ వార్డులోకి వెళ్లి తిరిగి సమస్యను తెలుసుకొని రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పడం తో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళన చేప ట్టిన వారిలో కాలనీ వాసులు ఉల్వల సురేష్, ఊస శ్రీ శైలం, రమేష్, ఉల్వల సతీష్, మల్లేశం, గోపాల్, నగే ష్, మహిళలు పాల్గొన్నారు.