Home సూర్యాపేట సూర్యాపేట కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

కోర్టు సీనియర్ క్లర్క్  కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు

                         SUICIDE1

సూర్యాపేట ప్రతినిధి :  ఆమెది నిరుపేద కుటుంబం. దంపతులు ఇద్దరు కూలీ పనులకు వెళ్తేగానీ పూట గడవని కుటుంబం. అయిన తనకు ఉన్న అర్ధ ఎకరం పొలంను బంధువులు ఆక్రమించడంతో న్యాయస్థానం మెట్లు ఎక్కింది.  ఇక డబ్బులిచ్చే స్థోమత లేదన్న ఆ మహిళను ఆ కీచక ఉద్యోగి కోరిన కోరిక మరింత కుంగదీసింది. దీనితో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం జరిపించాలని సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా సూర్యాపేట కలెక్టర్‌ను కలవడానికి వచ్చిన లక్ష్మీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

నల్ల గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రవి లక్ష్మీ దంపతులది నిరుపేద కుటుంబం. ఇద్దరు కూలి పనులకు వెళ్తేనే ఇళ్లు గడవడం కష్టం. ఈ నేపథ్యంలో లక్ష్మి తల్లిదండ్రులు మఠంపల్లిలో ఆమెకు ఇచ్చిన అరెకరం భూమిని వారి బంధువులు ఆక్రమించుకున్నారు. దీనిపై లక్ష్మీ 2011లో మిర్యాలగూడ కోర్టును ఆశ్రయించింది. తర్వాత 2014లో ఆ కేసు హుజూర్‌నగర్ సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే 2014 నుండి ఇప్పటి వరకు హుజూర్‌నగర్ కోర్టులో సీనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న గోవర్ధన్ ఆమె నుంచి ఏదో నెపంతో డబ్బులు గుంజుతున్నాడు.

కాగా, తన కేసు జడ్జి ముందు పెట్టడానికి గోవర్ధన్ ఐదు వేలు అడిగాడని గ్రీవెన్స్‌డేలో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు ప్రతి వాయిదాకు రెండు వేల వరకు క్లర్క్ గోవర్ధన్ 40 వేల వరకు తీసుకున్నాడని చెప్పారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. అనంతరం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. చివ్వెంల పోలీసు స్టేషన్‌కు భార్యా భర్తలిలిద్దర్ని పోలీసులు తరలించారు.