Friday, March 29, 2024

బంజారాహిల్స్ లో గోనే సంచిలో మృతదేహం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్2లోని ఫుట్‌పాత్‌పై గోనెసంచిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుపై గోనె సంచి ఉండడంతో అందులో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిని తెరిచి అందులో సుమారు 60ఏళ్ల మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మహిళ మృతదేహం ఎవరు పడేశారని స్థానికంగా ఉన్న సిసి కెమెరాల ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎవరు తెచ్చారు, ఎక్కడ నుంచి తెచ్చారు, హత్య చేసి తీసుకువచ్చి ఇక్కడ పడేశారా లేదా కరోనాతో మృతిచెందిందా?, సాధారణ మరణమా? తేలాల్సి ఉంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే అన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

Women Dead Body found at Banjara Hills Road no 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News