Home జనగామ జనగామలో టీ తాగారు కన్నుమూశారు…

జనగామలో టీ తాగారు కన్నుమూశారు…

Women dead with Tea in Jangaon

జనగామ: ఓ మహిళ టీ పొడి అనుకొని విష గుళికలు పాలలో కలిసి టీ తయారు చేసి కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అంజమ్మ అనే మహిళ తెల్లవారుజామున కుటుంబ సభ్యుల అందరికి టీ తయరు చేసి ఇస్తోంది. టీ పొడికి బదులుగా పాలలో ఎండ్రిన్ గుళికలు కలిపింది. కుటుంబంలో అందరూ టీ తాగారు. ఘటనా స్థలంలో అంజమ్మ మృతి చెందగా వాంతులు చేసుకున్న ఇద్దరిని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.