Home మంచిర్యాల పిడుగుపాటు.. ప్రాణాలకు చేటు

పిడుగుపాటు.. ప్రాణాలకు చేటు

Women Dies With Thunderbolt Fall In Mancherial Dist

కౌటాల ః వర్షాకాలం వచ్చిందంటే తరచుకగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంటుంది. వర్షం పడే సమయంలో చాలా సార్లు పిడుగులు పడుతుంతాయి. పిడుగు పాటుకు గురై నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఎక్కడో ఒకచోట మనుషులో , పశువులో ప్రాణాలను కోల్పొతున్నాయి. ఇటీవల కౌటాల మండలంలోని మండలంలోని కన్కి గ్రామంలో పిడుగుపాటుకు పార్వతి(40) అనే మహిళ మృతిచెందారు. ఈ కాలంలో పిడుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనుషులు, పశువుల ప్రాణాలను కాపాడిన వారమవుతాము. వాన వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎత్తైన చెట్ల కిందకు , ప్రదేశానికి పరుగులెత్తుతారు. ఇలా వెళ్లడం అంటే ఇంకా ప్రమాదానికి చేరువైనట్లే. పిడుగు ఇలాంటి ప్రదేశంలోనే పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పడదని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఎత్తైన భవనాలు, పెద్దపెద్ద చెట్లమీద ఎక్కువగా పడుతుంటాయి. అంటే ఎత్తైన ప్రదేశాలు, చెట్లు త్వరగా పిడుగులను ఆకర్షిస్తాయన్నమాట. ఒకవేళ పెద్దచెట్లు, బిల్డింగ్‌లు లేకపోతే పిడుగు మనుషుల మీద నేరుగా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి నుండి విద్యుత్ వాహకంగా పనిచేస్తాడు. పిడుగు అనేది ఒక విద్యుత్ ప్రవాహం కనుక మిగితా పరిసరాల కన్న మన ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు పిడుగు మనిషిమీద పడే అవకాశం చాలా తక్కువ. అలాగని మనుషుల మీద పిడుగులు పడవని కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పిడుగుల బారి నుండి మమ్మల్సి మనం కాపాడుకోవచ్చు.
పిడుగులు ఎలా పడతాయి…
వర్షాలు కురిసే సమయంలో వాతావరణంలోని పీడనం, ఉష్ణోగ్రతలో కలిగే మార్పుల కారణంగా పిడుగులు పడతాయి. పిడుగులు పడే ముందు భారీ శబ్దంతో కూడిన ఉరుములు, తీవ్రమైన కాంతితో మెరుపులు వస్తుంటాయి. పిడుగు అంటే ఆకాశంలో సహజ సిద్ధంగా ఉత్పన్నమయ్యే ఉత్పతం. ఇది భూమిలోకి చేరితేనే దాని తీవ్రత తగ్గిపోతుంది. పిడుగు భూమిలోకి వెళ్తున్న క్రమంలో అడ్డుచ్చిన దేనినైనా నాశనం చేసే స్వభావం కల్గి ఉంటుంది. భూమిని తాకేందుకు పిడుగు అత్యంత వేగంతో నేలపైకి దూసుకొస్తుంది. ఎత్తుగా ఉండి తడితో కూడుకున్న ప్రాంతాన్ని పిడుగు తీవ్రస్థాయిలో ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగానే పెద్దచెట్టు, నీటి పరిసర ప్రాంతంలో ఎక్కువ పిడుగు పడుతుండడాన్ని గమనించవచ్చు.
పిడుగు నుండి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు…
ఆ వర్షం వస్తుంది కదా అని పొరపాటున కూడా ఎత్తైన చెట్టుకింద నిలబడకూడదు. తాటిచెట్టు, మర్రిచెట్టులాంటి కింద అస్సలు నిలబడవద్దు. ఎందుకంటే ఎత్తైన చెట్టు త్వరగా పిడుగును ఆకర్షిస్తాయి. వాటి కింద ఉన్నవాళ్లపై కూడా పిడుగపడే అవకాశం ఉంటుంది.
ఆ సమయంలో సెల్‌ఫోన్‌లో కూడా మాట్లాడకూడదు. ఎలక్ట్రానిక్, రాకి, ఇనుములతోకూడిన పనిముట్లను దగ్గర ఉంచుకోవద్దు.
సెల్‌ఫోన్‌లకు చార్జింగ్ పెట్టొద్దు. టీవీలను ఆఫ్‌చేసి ఉంచాలి.
విద్యుత్ అయస్కాంత మోటర్ వస్తువులను ధరించి బయటకు రావద్దు.
కొన్నిసార్లు గొడుగులోని ఇనుప ఉచ్చలు కూడా పిడుగును ఆకర్షిస్తాయి.
ఇనుము, రాగి కండిలను నేలలోకి ఆనుకునేలా పెడితే పిడుగు వాటి ద్వారా విద్యుత్ ఆయస్కాంత తరగంగాలు భూమిలోకి వెళ్తాయి.
భవనాలు , టవర్లు భారీ నిర్మాణాలపై విద్యుత్ ప్రహాని ఏర్పాటు చేసుకోవాలి.

ప్రథమ చికిత్స…
పిడుగుపాటుకు ఎవరైనా గురైతే అక్కడున్నవారు భయాభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఉండాలి.

బాధితులకు తగిన సాయం అందించాలి.
పిడుగు పాటుకు గురైన వ్యక్తికి గాయాలైతే వెంటనే సురక్షిత ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అందించాలి.
ఆ వ్యక్తిని తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదు. అతనిలో ఎలాంటి విద్యుత్ ఆవేశం ఉండదు. కావున భయపడాల్సిన అవసరం లేదు.
ఆ వ్యక్తి దుస్తులను తొందరగా తొలగించాలి.
పడుకోబెట్టి తల భాగాన్ని కొంచెం కిందికి ఉండేలా చూసుకోవాలి.
పిడుగుపాటుకు గురైన వ్యక్తి శ్వాసను గమనించాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే మూతిలో నోరుపెట్టి గాలిని గట్టిగా ఊదాలి.
తన గుండెపై మెత్తగా నొక్కుతూ శ్వాసను సాధారణ స్థితికి వచ్చేలా చేయాలి.
అనంతరం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి.