Home అంతర్జాతీయ వార్తలు సింహంతో చెలగాటం (వీడియో వైరల్)

సింహంతో చెలగాటం (వీడియో వైరల్)

 

న్యూయార్క్: మన వెంట కుక్కలు వెంటపడితేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది మనకు ఎదురుగా సింహం కనిపిస్తే ఆ సెకనే ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఆమెరికాలోని న్యూయార్క్‌లో బ్రోంక్స్ జూపార్క్‌లో మృగరాజు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి అమ్మాయి దూకి తనతో ఫైట్ చేస్తావా అనే విధంగా ప్రవర్తించింది. కానీ యువతిపై సింహం దాడి చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సింహం దగ్గర వస్తున్నా కూడా తాను మాత్రం భయపడకుండా డ్యాన్స్ చేసింది. అంతేకాకుండా ఆమె దానిని భయపెట్టే విధంగా ప్రవర్తించింది. చేతులను పెద్దగా చాపుతూ సింహాన్ని భయపెట్టడంతో ఆమె వద్దకు అది రాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రీల్సోబ్రైనో అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిల పట్ల సింహం జాగ్రత్తగా ఉండలేదని, అమ్మాయి  ఆత్మహత్య చేసుకోవడానికి సింహం ముందు నిలబడిందని, కొంచెం సేపు అయితే డ్యాన్సే ఆమెను నరకానికి తీసుకపోయేదని, సింహం జంకు ఫుడ్ తినదని అమ్మాయిని ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు.

 

Women Enter into Lion’s Enclosure in America