Home జోగులాంబ గద్వాల్ ప్రాణం కాపాడినందుకు గద్వాల్‌లో మొక్క నాటిన మహిళ

ప్రాణం కాపాడినందుకు గద్వాల్‌లో మొక్క నాటిన మహిళ

Women planted the plant in Gadwal Govt hospital

 

హైదరాబాద్: తన ప్రాణాలు కాపాడినందుకు ఓ మహిళ గద్వాల్ ప్రభుత్వాసుపత్రిలో మొక్క నాటింది. విషమ పరిస్థితిలో ఉన్న తనకు వైద్యులు ప్రత్యేక చికిత్సను అందించారని, ఆ కృతజ్ఞత భావంతోనే మొక్కను నాటినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు అక్కడ పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సహాయక స్టాఫ్‌ను ఆ మహిళ కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌కు చెందిన సుజాత అనే మహిళ కరోనా సోకిందేమోననే అనుమానంతో దవాఖానలో టెస్టులు చేయించుకోవాలనుకుంది. అయితే హైదరాబాద్ దవాఖానాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆక్సిజన్ దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో తన పుట్టినిల్లు గద్వాలలో స్థానిక జిల్లా దవాఖానలో టెస్టు చేపించుకోగా పాజిటివ్ తేలింది.

తర్వాత అదే ఆసుపత్రిలో చేరి ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స పొందింది. చికిత్స తర్వాత కరోనా పరీక్షల్లో నెగటివ్ గా తేలింది. దీంతో డాక్టర్లు ఆమెను బుధవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈసందర్బంగా సుజాత మాట్లాడుతూ..ఆక్సిజన్ నిల్వలు లేక అనేక మంది చనిపోతున్న తరుణంలో ప్రభుత్వ దవాఖానలో తనకు చక్కని వైద్యం అందించినందుకు డాక్టర్లకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. కరోనా వచ్చిందని తెలియగానే ఆందోళన చెంది జిల్లాల నుంచి హైదరాబాద్ పరుగుపెట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లోనూ చక్కని వైద్యం అందుతోందని ఆమె పేర్కొంది. దేశంలో ఎన్నో చోట్ల ఆక్సిజన్ అందక, బెడ్లు దొరకక జనం పిట్టల్లా రాలిపోతుంటే తెలంగాణలో మాత్రం ప్రభుత్వ దవాఖానాలు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Women planted the plant in Gadwal Govt hospital