Home జగిత్యాల వ్యవసాయంలో రాణిస్తున్న మహిళలు

వ్యవసాయంలో రాణిస్తున్న మహిళలు

వేకువ జామున పొలం పనుల్లో నిమగ్నం
గ్రామాల్లో మహిళ రైతులే అధికం
మగవారి కంటే ఎక్కువ శ్రమిస్తూ
పొద్దంతా పొలం పనుల్లో మహిళలు

Women

కోరుట్ల రూరల్: దేశానికి రైతే వెన్నుముక రైతులేనిదే రాజ్యం లేదు రైతన్నల శ్రమలు గుర్తించాలని మేధావులు,రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నాటి కాలంలో మహిళలు వంటింటికే పరిమితమౌతు,ఎక్కువగా బీడిలు చుట్టుకునే వారు.కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారాయి.ప్రభుత్వ ఉద్యోగాలు,కుట్టుమిషన్లు, హోటల్‌లు, రాజకీయాలలో రాణిస్తున్నారు. అంతే కాకుండా వ్యవసాయంలో రాణిస్తు మహిళలు ఏ రంగంలోనైన రాణించగలమని నిరూ పిస్తున్నారు. మగవారితో సమాన హక్కులు కావాలని మహిళలు పలు మార్లు  పోరాటలు చేసిన సంధర్భాలు చాలా ఉన్నాయి. కేవలం హక్కుల కోసం పోరాటలు చేయడం కాక తాము ఎంతటి కష్టమైన చేయగము అని

నిరుపిస్తు. గ్రామాలలోని మహిళలు అతి కష్టమైన వ్యవసాయ రంగంలో సైతం అహార్నిశలు శ్రమించే వారు అధికమౌతున్నారు. వేకువ జామునే నిద్రలేచి ఇల్లు వాకిల్లను శుభ్రం చేయడంతో పాటు ఉదయం ఏడు గంటల వరకు వంటను ముగించుకుని పంట పొలాలకు పరుగులు తీస్తున్నారు.
మండుటెండను లెక్కచేయక…మండుటెండను లెక్కచేయక వ్యవసాయా న్ని మగవారి సహాయం లేకుం డా వరినాట్లు,పసుపు,పత్తి,మక్కలు లాంటి ఏలాంటి పంటలైన వేస్తు పంట పొiaలాకు నీరు పెట్టడంలో కొందరు మగువలు మగవారి కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. పండించిన పంటలను ఇంటికి చేర్చేవరకు మహిళలు పడుతున్న కష్టాలు అంతాఇంత కాదు. వరిచేనుల్లో ఒడ్లను చెక్కడం, నారు గుంజడంలోను మహిళలు వెనుకడుగు వేయక వరికోయడంలో సైతం ముందుంటున్నారు.ఇంతకు ముందు రోజుల్లో కలుపు పనులకు మాత్రమే ఆడవారిని పంటచేనులకు తీసుకెల్లేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయ పనులకు ఆడవారు రాలేని క్రమంలో ఆ పంటలు వేయడం మానుతున్న రైతున్నలు లేక పోలేరు.

జై రైతన్నలకు బదులు జై రైతక్కలు పంట చేనుల్లో దుక్కిదున్నేందుకు, వరికోతల సమయంలో మాత్రం మగ వారి అవసరం నాడు ఎక్కువగా ఉండేది ఇప్పుడు మరీ ట్రాక్లరు,్లయంత్రాలే ఆ పనులను చేస్తుంటాయి. అందుకు మగవారు చేసేది యంత్రాల్లోకి కావలసిన డీజీల్,మందు బస్తాలు పట్టణాల్లోంచి పల్లెలకు చేరవేయడం లాంటి కొద్దిపాటి శ్రమలు చేస్తున్నారు. అవి మహిళరైతుల చేతులకు అందించి వారు వెల్లిపోయిన పొద్దుననుండి మాపటికల్ల పంటపొలల పనులు పూర్తి అయ్యాకే ఆ మహిళలు ఇళ్ళకు చేరుకుంటారు. రాత్రిపూట భోజనం ముగించుకొని నిధ్రలోకి జారుతుంటా రు. వారికి విశ్రాంతి అంటే ఆ నిదురించే సమయంలోనే అంటే వ్యవసాయంలో మగవారికి మహిళల సాయం చేస్తుంటే జై రైతన్నలకు బదులు జై రైతక్కలు అనితీరల్సిందేగా.

రాజకీయాల్లో మగవారు:గ్రామాలలో నేడు మగవారు రాజకీయాలలో రాణిస్తు పొలం పనులకు వెల్లడానికి వారికి సయమమే లేకుండా పోతుంది. ఐన వారి వ్యవసాయం కొనసాగుతూనే ఉంటుంది. తమ మహిళలను వారి వాహానాల ద్వారా పంటచేనులకు చేర్చి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే చాలు మిగతా పనులన్ని ఆ మహిళలే చేసుకుంటారు. పనులు ముగిశాయని సమాచారం ఇస్తే చాలు వారిని ఇంటి వద్దకు చేర్చుతుంటారు.