Wednesday, April 24, 2024

జిల్లాలో షీ కారు

- Advertisement -
- Advertisement -

జిల్లాలోని మహిళలకు రక్షణ
కార్లు, ఆటోల్లోమహిళలే
నల్లగొండ జిల్లాలో ట్యాక్సీ, ఆటోలు

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: సామాజిక భద్రతలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్ మహానంగరం అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ పుణ్యక్షుత్రం అయిన యాదాద్రి మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పటణాల్లో ప్రయోగాత్మకంగా షీకారు (ట్యాక్సీ), షీఆటోలను మహిళలచే నడిపించనున్నారు. త్వరలో శిక్షణ పొందిన మహిళలు.. ఆటో డ్రైవర్లుగాను, కారు డ్రైవర్లుగాను రోడ్లపై కనిపించనున్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రంలోని ప్రధాన పట్టణ కేంద్రాన్ని ఎంపిక చేసినట్లు స త్వరలో షీట్యాక్సీ, షీఆటో రవాణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే టిటిడిసి శిక్షణ కేంద్రంలో సామాజిక భద్రతపై ‘ది మహాత్మా గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్’ (హైదరాబాద్ సంస్థ), ఇందిరా క్రాంతిపథం జిల్లా సమాఖ్య, మండలాల సమాఖ్య, జెండర్ కమిటీ (సామాజిక భద్రత) మహిళలకు రెండు రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహించి అవగాహన కల్పించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టణ కేంద్రానికి ప్రతి రోజు చదువు, ఇతర పనుల నిమిత్తం బాలికలు, యువతులు, మహిళలు అధిక సంఖ్యలో రాకపోకలను సాగిస్తుంటారు. కేవలం మహిళలకోసం మాత్రమే మహిళా ట్యాక్సీ, మహిళా ఆటో డ్రైవర్లు పని చేస్తారు. కేవలం మహిళలను మాత్రమే వారి వాహనాల్లో తీసుకెళ్తారు. పురుషులను వారి వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతివ్వరు. ఇలాంటి సర్వీసు ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహిళ టాక్సీ, మహిళ ఆటో డ్రైవర్లను ఏర్పాటు చేసి మహిళలను రక్షణ కల్పించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా మహిళలు, విద్యార్థినులకు, యువతులకు మరింత ఊరట లభించనుంది. సాంకేతిక పరిజ్ఞానంతో.. నడి వాహనాలు పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ఫోన్ కాల్ చేయగానే ఎక్కడ నుంచి ప్రయా మొదలైంది.. ఏ మార్గంలో రాకపోకలను సాగించా ఎక్కడి వరకు ప్రయాణం కొనసాగింది. ఇలా పూర్తిగా రికార్డు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మహిళల భద్రతపై నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సర్వీసులు హైదరాబాద్, ముంబాయి లాంటి మహానగరాల్లో ప్రైవేటు కంపెనీలు అందిస్తున్న విషయం తెలిసిందే.. నైపుణ్యం, భద్రత కోసం శిక్షణ కేంద్రం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మహిళలకు వివిధ రకాల శిక్షణ నైపుణ్యాలు నేర్పించి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాలను ఎంపిక చేసింది. మొ నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టును ఏర్పాటు చేసి అమలు చేయడానికి ది మహాత్మాగాంధీ నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ హైదరాబాద్ సంస్థ ముం చర్యలు ప్రారంభించింది. కాగా ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఈ సంస్థ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్‌లను కలిసి దానికి సంబంధించిన స్థలం కావాలని లేఖను అందజేశారు. మహిళలకు వివిధ రకాల శిక్షణలను ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటు అనంతరం షీకారు, షీఆటో మహిళా డ్రైవర్లకు డ్రైవింగ్ శిక్షణతో పాటు వివిధ రకాల శిక్షణలను ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగానే మహిళలను డ్రైవర్లుగా నియమిస్తారు.

ఇలా గుర్తిస్తారు…

వివిధ సంస్థల ద్వారా ఇది వరకు ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలను గుర్తిస్తారు. ఉన్న వారికి కారు, నడిపే విధంగా శిక్షణ ఇస్తారు. వారికి కార్లు, రుణాలపై అందించి జీవనోపాధి కల్పిస్తారు. పొందడం ద్వారా మహిళ ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా తీర్చిదిద్దడమే ‘మేక్ ఇన్ ఇండియా’ కానున్నది. పర్యవేక్షణ… మహిళలకు రక్షణ, కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఎంపిక చేసింది. బృం ఐఏఎస్, పూనం మాలకొండయ్య, సంబర్వాల్, రామాయ్యర్, లక్రాతో పాటు కార్యదర్శి సునీల్ శర్మ ఉన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా ఈ బృందం పర్యవేక్షణ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News