Home ఎడిటోరియల్ మహిళా వికాసమే మానవ ప్రగతి

మహిళా వికాసమే మానవ ప్రగతి

Womenప్రపంచ మహిళల్లో అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుండడమే గాక ప్రతి ఇంట్లో కూడా వంటింటి బాధ్యత మహిళదే కావడం వల్ల కుటుంబం ఆహార భద్రత బాధ్యత కూడా మహిళపైనే పడుతుంది, మహిళను కష్టాలనుంచి ఆదుకోకుండా ప్రపంచంలో పేదరిక నిర్మూలన అసాధ్యం. 2030 నాటికి ప్రపంచ మనుగడకు అవసరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించాలన్న ధ్యేయ ప్రకటనకు అనుగుణంగా గ్రామీణ మహిళల అభివృద్ధి విషయంలో మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మంచినీళ్లు తెచ్చుకోవడం దగ్గర నుంచి తమ కుటుంబానికి సంబంధించిన పనుల్లో పట్టణా ల్లోని మహిళలకంటె ఎక్కువగా తలమునకలవుతుంటారు. ఆఫ్రికా కు చెందిన 25 దేశాల్లోని మహిళలు మొత్తం కలిసి మంచినీళ్లు తెచ్చుకోవడానికే రోజుకు 16 మిలియన్ గంటలు ఖర్చు చేస్తుండగా, పురుషులు ఆరు మిలియన్ గంటలు, బాలలు 4 మిలియన్ గంట లు కృషిచేయవలసి వస్తున్నట్టు లెక్క తేలింది. ఇన్ని పని గంటలు ఆదా చేయగలిగితే ఆదాయం పెంపొందించే ప్రత్యామ్నాయ కార్య క్రమాలవైపు వారు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఈ దిశలో సాగించిన కృషి ఫలితంగా 1990 నుంచి 2010 మధ్యకాలంలో రెండు బిలియన్ల జనాభాకు తాగునీటి సౌకర్యం కల్పించినప్పటికీ ఆఫ్రికాదేశాల్లో ఇంకా 748 మిలియన్ల మంది మహిళలు తాగు నీటిని తెచ్చుకోవడానికే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. భారత దేశంతో సహా అభివృద్ధి చెందని లేదా ఇంకా వెనుకబడిన అన్ని దేశాల్లోనూ మహిళల పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో 46 శాతం పైగా మహిళలే పనిచేస్తున్నప్పటికీ, వ్యవసాయ భూమిలో దాదాపు 20 శాతం మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతు న్నాయి. నిరక్షరాస్యత, కుటుంబ కలహాలు, ఇతర పెత్తందారీ పరి స్థితుల వల్ల కనీసం రెండు శాతం భూమిపై కూడా మహిళలకు వాస్తవ హక్కులు లేవని తేలిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ మహిళల్లో అత్యధికశాతం కేవలం వ్యవసాయ కూలీలుగానే మన గలుగుతున్నారు.

ప్రభుత్వం చేపట్టే పథకాల్లో తప్ప సాధారణ పను ల్లో మహి ళలకు ఇచ్చే కూలీ తక్కువగానే ఉంటున్నది. లింగ వివక్ష ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చాలా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. 142 దేశాల్లో లింగ వివక్షత పై నిర్వహిం చిన సర్వేలో భారతదేశం 127వ స్థానంలో ఉండటం గమనార్హం. భారతదేశంలోని 121 కోట్ల జనాభాలో 83.కోట్ల కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తుండగా, 37.7 కోట్లమంది పట్టణాల్లో ఉంటు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల సంఖ్య 42.80 కోట్లు కాగా మహిళల సంఖ్య 40.5 కోట్లు. ప్రకృతి వైపరీత్యాల సందర్బంగా, ఇతర సమయాల్లోనూ పురుషులకంటే 14 రెట్లు ఎక్కువగా మహి ళలు, పిల్లలే చనిపోతున్నట్టు 141 దేశాల్లో జరిగిన అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే అరికట్టగలిగే అవకాశం ఉన్న వ్యాధుల్లో మృత్యుబారినుంచి రక్షించగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పేదరికం కారణంగా సకాలంలో సరైన వైద్యం అందక చనిపోయే వారిలో 60 శాతం మహిళలు, 53 శాతం వరకు శిశువులు ఉంటున్నారని తేలింది. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో 76.0 శాతంమంది మహి ళలు అక్షరాస్యులు కాగా, గ్రామీణ పాంతాల్లోని 56.8 శాతం మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులని 2014 అంచనాలు చెబు తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. అయితే పట్టణ మహిళకు సగటున రోజుకు 610 రూపాయలు లభిస్తుండగా గ్రామీణ మహిళకు 429 రూపా యలే లభిస్తోంది. ఇదే సమయంలో పురుషునికి పట్టణాల్లో 805 రూపా యలు, గ్రామీణ ప్రాంతాల్లో 550 రూపాయలు లభిస్తోంది. అయితే కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఉద్యోగం చేయాలా వద్దా వంటి వాటిల్లో గ్రామీణ మహిళలు చొరవ చూపలేక పోవడా నికి లింగ వివక్ష, కారణమవుతోంది. ప్రపంచంలో గ్రామీణ జనాభా 1965లో ఉన్న 66.4 శాతం నుంచి 2015 నాటికి 46.1 శాతానికి తగ్గిపోగా భారత దేశంలో ఇదే కాలంలో 82 నుంచి 67 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతా ల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతుండడం వలసలకు దారి తీస్తున్నది. వ్యవసాయం, చేనేత మత్స్య, పాడి, కోళ్ల పరిశ్రమల్లో ఉపాధి తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాలనుంచి వలసలు తప్పడం లేదు పురుషులు వలసబాట పడితే కుటుంబ ఆదాయంలో సుమా రు 48 శాతం వరకు సంపాదిస్తున్నమహిళలపైనే కుటుంబపోషణ, యాజమాన్య భారం పడుతున్నది, గ్రామీణ మహిళలు సైతం దూరవిద్య కేంద్రాల ద్వారానైనా సరే విద్యాభ్యాసంపై దృష్టి సారించి పట్టణాల్లో ఉపాధి అవకాశాల కోసం ఎగపాకుతున్నట్టు ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 1972-73 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో31,8 శాతం మహిళలు ఉపాధి పొందుతుండగా 2011-12 నాటికి గ్రామీణ మహిళా కార్మికుల సంఖ్య 24.8 శాతానికి పడిపోయింది. ఇదే సందర్బంగా పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల సంఖ్య 13.4 నుంచి 14.7 శాతానికి పెరిగింది.

డిగ్రీ స్థాయిలో చేరే విద్యార్థుల్లో మహిళలు 2012-13 నాటికి 45.9 శాతం మంది కాగా, డాక్టరేట్ కోసం నమోదైన వారిలో 40.5 శాతం మంది మహిళలే కావడం విశేషం. ఇంజినీరింగ్ టెక్నాలజీ రంగంలో 28.5 శాతం మహిళలు విద్యనభ్యసిస్తుండగా, ఐటి కంప్యూటర్ రంగంలో 40.2 శాతం, మేనేజ్‌మెంటు కోర్సుల్లో 35.6 శాతం, న్యాయవిద్యలో 32 శాతం మహిళలు నమోదయ్యారు. ఇలా మహిళలు విద్య, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంవల్ల 15 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసున్న మహిళల్లో క్రమం తప్పకుండా జీతభత్యాలు అందుకునే మహిళలసంఖ్య 1972-73 లో కేవలం 1.2 శాతం ఉండగా 2011-12 నాటికీ 13.4 శాతానికి పెరిగింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ 2030 నాటికి పేదరిక నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి ద్వారా పౌష్టికాహార భద్రత కల్పించి ఆకలిని దూరంచేయడం, అన్ని వయసుల వారి ఆరోగ్య పరిరక్షణ, అందరికి నాణ్యమైన విద్య అందజేయడంతో పాటు జీవితాంతం ఉన్నత విద్య నభ్యసించే అవకాశాలు మెరుగు పరచడం, లింగ వివక్షతను అరికట్టి స్త్రీ పురుషులందరికి సమానావకాశాలు కల్పిం చడం వంటి 17 మౌలిక అంశాలకు ప్రాధాన్యత నివ్వాలని ఐక్య రాజ్యసమితి చేసిన ప్రతిపాదనలను బలపరుస్తూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2015 సెప్టెంబర్ 26 వ తేదీన అంతర్జాతీయ వేదికపై 18 నిముషాలపాటు సుదీర్ఘ ఉపన్యాసమిచ్చారు. దేశంలోని అన్నిగ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తానని ప్రధానమంత్రి ప్రకటించగా, తెలంగాణలో అన్నిఇళ్ల కు నల్లా కనెక్షన్ ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగబోనని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు స్పష్టం చేశారు. మహిళల విద్యావకాశాలు, ఆర్ధిక ప్రగతికి తోడ్పడే ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్యం, శారీక, మానసిక వికాసం వంటి ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత నిస్తూ ప్రణాళికల ద్వారా ప్రగతి సాధించిన రోజు నిజంగా గ్రామీణ మహిళలు గర్వంగా తలెత్తుకుని తిరిగే అవకాశం తప్పక లభిస్తుంది. గ్రామీణ మహిళల కష్టాలు తీర్చగలిగితే ప్రపం చంలో దాదాపు సగం సమస్యలు తీరినట్టే. ఈ దిశలో నేతలందరూ కృషిచేసిన రోజున గ్రామీణ మహిళలకు తిరుగే ఉండదు.

– కెబి రామ్మోహన్, 9346235072