మన తెలంగాణ/రేగొండ: తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మహిళా స్త్రీ శక్తి నూతన భవనాల ప్రారంభోత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి భవనాలను ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… భూపాలపల్లి నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంచే విధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడంతో పాటు బిఎం..38 కెనాల్ కాలువ ద్వారా చివరి ఆయకట్టు రెండు పంటలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా పిఏసిఎస్ చైర్మన్ గోపు బిక్షపతి కోరిక మేరకు భవన ప్రహారి గోడ నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళా స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎంపిపి ఈర్ల సదానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల శక్తి అనితర సాధ్యమైందని కొనియాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మహిళల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రపంచంలో సిరిమావోబండారి నాయకి, ఇందిరాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ, మాయవతి, వసుంధరరాయ్ సింధియా లాంటి మహిళలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ మహిళలు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఇంటికి ఆడ బిడ్డ పుడితే భారం కాకూడదని కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలలో తెలుగింటి ఆడ బిడ్డలను ఆదుకోవడం జరిగిందన్నారు. మహిళా సంఘ భవనంలో రిఫ్రిజిరేటర్ కొనిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎంపిడివో తనుగుల రమేష్, పిఏసిఎస్ చైర్మన్ గోపు బిక్షపతి, ఎపిఎం ఝాన్సీ, ఎపివో ఎండి. అబ్దుల్ అలీం, సర్పంచ్ మోడెం ఆదిలక్ష్మీ, ఎంపిటిసి పట్టెం శంకర్, మహిళా మండల అధ్యక్షురాలు కట్ల రాధిక, కొడవటంచ ఆలయ చైర్మన్ కొల్గూరి రాజేశ్వర్‌రావు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోడెం ఉమేష్ గౌడ్, నాయకులు పున్నం రవి, మైస బిక్షపతి, లెంకల రాజిరెడ్డి, అయిలి శ్రీధర్, భలేరావు మనోహర్ రావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మటికె సంతోష్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బండి కిరణ్, పనికెల రాజేందర్, సూర మహేందర్, మరిగిద్దె రామారావు, మారబోయిన ధనుంజయ, మెండు రాధ రవీందర్, పెరుమాండ్ల శ్రీలత మహేందర్, పోగు వీరలక్ష్మీ, సారంగపాణి, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా అభ్యున్నతే… ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -