Thursday, April 25, 2024

సెమీసే లక్ష్యంగా భారత్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్‌కు చేరుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్ రెండో టి20లో బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది. ఇక, కివీస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని తహతహలాడుతోంది. ఇక, న్యూజిలాండ్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఇరు జట్లలోనూ స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా న్యూజిలాండ్ పేరు తెచ్చుకుంది. అంతేగాక భారత్‌పై కివీస్‌కు అద్భుత రికార్డు కూడా ఉంది.

కానీ, ఇటీవలే పెద్ద పెద్ద జట్లను సయితం అలవోకగా ఓడిస్తున్న భారత్‌ను ఓడించడం న్యూజిలాండ్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. గాయంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే భారత్ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారవుతుంది. యువ ఓపెనర్ షఫాలి వర్మ అద్భుత ఫామ్‌లో ఉంది. బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న విషయం తెలిసిందే. శిఖా పాండే, రాజేశ్వరి, అరుంధతి, హర్మన్‌ప్రీత్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక మంధాన, షఫాలి, దీప్తి, రోడ్రిగ్స్, వేదా, హర్మన్ తదితరులతో బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, కివీస్‌లో కూడా స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. కెప్టెన్ సోఫి డివైన్, సుజి బెట్స్, అమెలియా కర్ తదితరులతో కివీస్ బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాడడం ఖాయం.

 Women’s T20 World Cup 2020: INDW vs NZW Match today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News