Friday, March 29, 2024

చెలరేగిన ఆసీస్ ఓపెనర్లు.. భారత్ టార్గెట్ 185

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా మెల్ బోర్న్ స్టేడియం వేదికగా భారత్ జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఆసీస్, భారత్ జట్టుకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ ఓపెనర్లు అలిస్సా హేలి(75; 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లు), బెత్ మూనీ(78;10 ఫోర్లు)లు మెరుపులు మెరిపించింది.భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది.ముఖ్యంగా ఓపెనర్ అలిస్సా హేలి భారీ షాట్లతో విధ్వంసం సృష్టించింది. ఫోర్లు, సిక్స్ లతో భారత బౌలర్లను హడలెత్తించింది. దీంతో వీరిద్దరూ మొదటి వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో భారీ షాట్ కు యత్నించి అలిస్సా హేలి ఔటైంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ లన్నింగ్(16), జార్డ్నింగ్(02)లు తక్కువ స్కోరుకే వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో చివర్లో స్కోరు బోర్డు వేగం తగ్గింది. దీంతో 200 పరుగుల స్కోరు సాధిస్తుందనుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.

Womens T20 World Cup: AUW Set 185 runs target to INDW

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News