Saturday, April 20, 2024

మండల కేంద్రాల్లో మహిళా వేదికలు

- Advertisement -
- Advertisement -

మన హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు వేదికల తరహాలో మహిళా వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వ యం సహాయక బృందాలకు జాతీయస్థాయిలో నాబార్డు, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సమాఖ్య, ఎనబుల్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా వు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.

జాతీయస్థాయిలో తెలంగాణకు చెందిన కా మారెడ్డి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణాది రాష్ట్రాల కేటగిరిలో హనుమకొండ జిల్లా బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడం పట్ల మంత్రి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాలకు కూడా రైతువేదికల వంటి భవనాలను నిర్మించాలని, అవసరమైతే గ్రామాల్లో ఈ భవనాలు కట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని మంత్రి వెల్లడించారు.
బృందం సభ్యురాలు చనిపోతే రుణం మాఫీ
మహిళల సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సిఎం కెసిఆర్ స్వయం సహాయక బృందాల్లో షూరిటీ లేకుండా 3 లక్షల రు ణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. రూ.3 లక్షల రుణం తీసుకుని కొంత చెల్లించిన తర్వాత చనిపోతే, చెల్లించిన మొత్తాన్ని వారి కు టుంబ సభ్యులకు అందజేయనున్నట్లు చెప్పారు.
నాటి డ్వాక్రా సంఘాల పరిస్థితి నేడు లేదు
నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను.. గ్రామాలు, కుటుంబాలు అభివృద్ది చెందాలంటే మహిళల వద్ద డబ్బులు ఉండాలని గట్టిగా నమ్ముతాను. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే వారిపై అరాచకాలు తగ్గుతాయని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ఎన్టీఆర్ పాలనలో డ్వాక్రా సంఘాలు పెట్టారు. నాడు బ్యాంకుల వద్ద మహిళలు కనిపిస్తే అభాండాలు వేసే వారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇపుడు ఆర్ధికంగా మహిళలు పైకి వచ్చారు. కుటుంబం వారిని గౌరవిస్తుంది. ఆ కుటుంబాన్ని మహిళలు కాపాడుతున్నారు. అవార్డుల ప్రదానోత్సవానికి 17 రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారు. వీరందరినీ అభినందిస్తున్నాను.
రాష్ట్రం రాక ముందు రూ.4వేల కోట్లు, నేడు రూ. 18 వేల కోట్ల రుణం
తెలంగాణ రాష్ట్రం రాక ముందు మహిళా సంఘాలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తే… ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం మహిళా రుణాలు ఇస్తోంది. తమిళనాడు ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు మహిళలకు రుణాలుగా ఇస్తుండగా, మిగిలిన రాష్ట్రాలు వెయ్యి, రెండువేల కోట్ల చొప్పున రుణాలు ఇస్తున్నాయి. మహిళలకు అత్యధిక రుణాలు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమని గర్వంగా చెబుతునున్నాను. సిఎం కెసిఆర్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
అభయహస్తం డిపాజిట్ సొమ్ము తిరిగి ఇస్తాం
అభయహస్తం కింద గతంలో రూ.500 పింఛన్ కోసం డిపాజిట్ తీసుకున్నారు. రూ. 500 పింఛన్ ఇచ్చే వారికి ఇప్పుడు మనమే రూ.2016 పింఛన్ ఇస్తున్నాం కాబట్టి, వారు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని మంత్రి దయాకర్‌రావు తెలిపారు.
నిన్ననే ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు, సంబంధిత కార్యదర్శులతో సమీక్షించాం. త్వరలోనే ఈ మొత్తాలను ఇస్తున్నాం. వడ్డీ లేని రుణాలు కూడా రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు. రా ష్ట్రంలో 17978 సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ పటిష్టంగా ఉన్నాయి.మహిళా సంఘాలు ఆర్ధికంగా పైకి రావడానికి అన్ని వసతులు గ్రామాల్లో కల్పించనున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News