Thursday, April 25, 2024

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు బోణి..

- Advertisement -
- Advertisement -

Women's World Cup 2022: Aus beat Eng by 12 Runs

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు బోణి
ఇంగ్లాండ్‌పై 12 పరుగుల తేడాతో విజయం
హామిల్టన్: ఆస్ట్రేలియా ఓపెనర్ రేచల్ హేన్స్ సెంచరీ సాధించడంతో శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికను తెరిచింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. హేన్స్, హేలీ మొదటి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో స్కీవర్ బౌలింగ్‌లో హేలీ (28) బ్రంట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆసిస్ తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లన్నింగ్‌తో జతకట్టిన హేన్స్ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఓ ఆట ఆడు కున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నారు. కొద్దిసేపటికే సెంచరీకి చేరువైన లన్నింగ్ (86) బ్రంట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఓవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నా మరోవైపు హేన్స్ మాత్రం తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారింది. ఈ క్రమంలో హేన్స్ (130) సెంచరీ సాధించిన కొద్దిసేపటికే స్కీవర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా క్రీజును వదిలింది. హేన్స్ ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు, ఒక సిక్స్ ఉ న్నాయి. మూనీ (27), పెర్రీ (14) చివరి వరకు క్రీజులో ఉండడంతో ఆస్ట్రేలియా నిర్ణిత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్కీవర్ రెండు, బ్రంట్‌కు ఒక వికెట్ దక్కాయి.
స్కీవర్ సెంచరీ వృథా..
అనంతరం భారీ లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే విన్‌ఫీల్డ్ హీల్ (0) పరుగులేమీ చేయకుండానే వికెట్ సమర్పించుకుంది. ఈ దశలో మరో ఓపెనర్ బిఅమౌంట్ కెప్టెన్ హీదర్ నైట్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పెంచే బాధ్యతను తన భుజాన వేసుకుంది. వీరిద్దరూ కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత తహ్లియా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో నైట్ (40) పెవిలియన్‌కు చేరింది. మరికొద్దిసేపటికే దూకుడుగా ఆడుతున్న బిఅమౌంట్(74) అర్ధ సెంచరీ సాధించిన కొద్దిసేపటికే స్టౌంప్ అవుట్‌గా వెనుదిరిగింది. అప్పటికే క్రీజులో ఉన్న స్కీవర్ ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగి ఆడింది. వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ సాధించింది. ఇక క్రీజులోకి వచ్చిన జోన్స్ (4), వ్యాట్(7) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్కీవర్ మాత్రం బౌండరీలు బాదుతూ విజయంపై ఆశలు చిగురింపజేసింది. ఈక్రమంలోనే సెంచరీ నమోదు చేసింది. అయితే డంక్లీ(28), బ్రంట్(25) చివర్లో సహకరించినా, అప్పటికే ఓవర్లు దగ్గరపడడంతో స్కీవర్(109, నాటౌట్) జట్టును గెలిపించలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ నిర్ణిత ఓవర్లలో 298 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కింగ్ 3, మెక్‌గ్రాత్ 2, జొనాస్సెన్ 2, ష్కట్‌కు ఒక వికెట్ దక్కింది.

Women’s World Cup 2022: Aus beat Eng by 12 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News