మనతెలంగాణ/ముథోల్: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని భైంసా డీఎస్పీ అందెరాములు అన్నారు. శుక్రవారం వేకువాజామున మండల కేంద్రమైన ముథోల్‌లోని పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ విలేకర్లతో మాట్లాడుతుశాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తామన్నారు. ముఖ్యంగా సరైన పత్రాలు లేని వాహనాలను చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ముథోల్ భైంసా డీఎస్పీ ఆధ్వర్యంలో ముథోల్ సీఐ రఘుపతి, ముథోల్ తానూర్, లోకేశ్వరం, కుంటాల ఎస్సైలు కోదాడి రాజు, రాజన్న, రమేశ్, యూనిస్ పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్‌లోపాల్గొన్నారు.స్థానిక కోలిగల్లి, పాతబస్టాండ్, నాయాబాదీ, ప్రాంతాల్లో 31 ద్విచక్రవాహనాలు, 06ఆటోలు , 02 ట్రలి ఆటోలు, 2టాటా ఎసీ ఆటోలు , 01 టాటా ఎసీ ట్రలీ తోపాటు 50మద్యం బాటిళ్లు, నలుగురు వద్ద నుండి రూ. 50విలువ గుట్కా ప్యాకేట్ల, సీలిండర్లు, నలుగురు మట్కా జూదర్దను కార్డెన్ సెర్చ్‌లో స్వాధానంచేసుకున్నట్లు సీ ఐ రఘుపతి తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి
- Advertisement -
- Advertisement -