Home కరీంనగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

mahila* అంగన్‌వాడీ టిఎన్‌జివో జిల్లా అనుబంధ కార్యవర్గం ఏర్పాటు
* శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
మన తెలంగాణ/కరీంనగర్ టౌన్: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అంగన్‌వాడీ యూనియన్ టిఎన్‌జివో జిల్లా అనుబంధ కార్యవర్గం ఏర్పడగా గురువారం నూతనంగా ఎన్నికైన నూతన జిల్లా అధ్యక్షురాలు గర్రెపల్లి రమాదేవి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్‌వాడీ సమస్యల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలోనే వరాల జల్లు కురిపించారని అన్నారు. అందరి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా నూతన కార్యవర్గంగా ఏర్పడడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఏ సమస్యలు ఉన్న తాను పరిష్కరించేందుకు ప్రభుత్వ వారిధిగా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
నిజామాబాద్‌లో ఈ నెల 14న తమ యూనియన్ సమావేశం ఉందని రమాదేవి తెలుపగా కరీంనగర్ నుండి అంగన్‌వాడీలు తరలివెళ్ళేందుకు వాహనాలను సమకూర్చి సహాయ సహకారాలు అందిస్తానని వారికి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షురాలు స్వరూపరాణి, ప్రచార కార్యదర్శి ఎన్. లక్ష్మి, అర్బన్ అధ్యక్షురాలు వనజ, కార్యదర్శి శీరిష, నాగశ్రీ, పద్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.