Home తాజా వార్తలు నిబద్ధతతో పని చేయండి : డిజిపి

నిబద్ధతతో పని చేయండి : డిజిపి

DGP Mahender Reddyహైదరాబాద్ : పోలీసులు నిబద్ధతతో పని చేసి, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ ను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆయన పోలీసులకు సూచించారు. సోమవారం ఉదయం ఆయన పంజాగుట్ట పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. ఈ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు విషయంలో స్టేషన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆయన ఆదేశించారు. అందిన ఫిర్యాదులను స్వీకరించి, వారికి రశీదు ఇవ్వాలని, కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. డిజిపి మహేందర్ రెడ్డితో పాటు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కూడా పంజాగుట్ట పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు.

Work With Commitment : DGP Mahender Reddy