Home తాజా వార్తలు కారు ప్రమాదంలో వ్యక్తి మృతి

కారు ప్రమాదంలో వ్యక్తి మృతి

 

Car Accident

 

రంగారెడ్డి: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… తిమ్మాపూర్‌ గ్రామంలోని యశోదారావు అనే వలస కార్మికుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యశోదారావు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలియలేదని, ఘటనానంతరం కారు డ్రైవర్‌, కారుతో సహా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Worker Killed In Car Accident At Ranga Reddy District