Saturday, March 25, 2023

పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి

- Advertisement -

polio

మన తెలంగాణ / ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకొని, పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లిబౌలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రితో పాటు జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మనీషా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రాజీవ్ రాజ్, ఇమ్యునైజేషన్ అధికారి తొడసం చందు, కమిషనర్ మారుతి ప్రసాద్, ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అంగ వైకల్యాన్ని జయించటానికి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు వయస్సుగల పిల్లలందరికి పోలియో నివారణ చుక్కల మందును వేయించాలని ప్రజలకు సూచించారు. అవగాహన లోపంతో తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాటు కారణంగా బిడ్డ జీవితాంతం పోలియో వ్యాధిగ్రస్తుడుగా మిగిలిపోవాల్సి వస్తుందని, అందుకే పోలియో వ్యాధి లక్షణాలను, పోలియో వ్యాధి  రాకుండా ముందస్తుగా పోలియో చుక్కలను వేయిస్తూ జాగ్రత్త తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చుక్కలు వేసుకోక తప్పిపోయిన చిన్నారులను గుర్తించి 2 విడతలో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News