Home తాజా వార్తలు కులాల పేర్లు మార్చేందుకు కృషి:ఈటల రాజేందర్

కులాల పేర్లు మార్చేందుకు కృషి:ఈటల రాజేందర్

etela

వేములవాడ: పలకడానికి ఇబ్బందిగా ఉన్న కులాల పేర్లు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన పూసల సంఘం రాష్ట్ర కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇబ్బందికరమైన పలు కులాల పేర్లను మార్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చిస్తోందని, సంచార జాతుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వీటి కార్యకలాపాల నిర్వహణ కోసం జిల్లా కేంద్రాలల్లో భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Working to change the names of castes: Etela Rajender