Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఆదివాసీల సంస్కృతి సజీవం

ఆదివాసీల సంస్కృతి సజీవం

Adivasi

ఎంత ఎదిగినా మారని సాంప్రదాయాలు,  అడవి వెంటే ఆనందాలు,  ఇష్టంగా కాయకష్టం,  నేడే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

సిర్పూర్(యు): దక్కన్ పీఠభూమిలో నివసిస్తున్న ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. శతాబ్ధాల చరిత్ర ఉన్న ఆదివాసీల కట్టు, బొట్టు, ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం, నీతి నిజాయితీ, అత్యంత సామరస్యం కలిగిన వీరి జీవన విధానాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక గిరిజన జాతులుండగా ఉమ్మడి రాష్ట్రంలో 35 ఉప కులాలున్నాయి. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా గోండులు, కొలాంలు, మన్నెవార్‌లు, తోటి, ప్రధాన్, లంబాడా, నాయక్‌పోడ్‌లు, ఎరుకలు, కోయ, ఇతర తెగలు సహ జీవనం కొనసాగిస్తుండగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి జీవన ఇతి వృత్తాన్ని తెలిపే మన తెలంగాణ ప్రత్యేక కథనం

నాటి నుంచి నేటి దాకా చరిత్ర పుటల్లో ఆదివాసీలు
రాజుల పాలనలో ఉన్న అప్పటి గిరిజన ప్రాంతాలన్నీ చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్, మానిక్‌గఢ్, రాజురా, ఆసిఫాబాద్ ప్రాంతాలన్నీ గోండు రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలే. ఇప్పటి సిర్పూర్(యు) ప్రాంతంతో పాటు మొత్తం ఏజెన్సీలోని 20 సామంత రాజ్యాలుగా రాజ్య పాలన సాగించిన ఆనవాళ్లు సజీవంగా మిగిలి ఉన్నాయి. ఎంత ఎదిగినా మారని సాంప్రదాయాలు ఒక వైపు, అడవి వెంటే ఆనందాన్ని వెతుక్కునే ఆదివాసీ గిరిజనులు తాము చేసే కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న వైనం ఇక్కడి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తోంది. ఆదివాసీ ప్రాంతాల్లో తమ హక్కుల కోసం అనేక మంది వీరులు అసువులు బాసిన ఘటనలు కోకొల్లలు. నిజాంకు ఎదురు తిరిగిన గోండు బిడ్డ కొమురం భీం అప్పటి నిరంకుశ పాలనకు చరమ గీతం పాడగా గోండుల్లో తొలి పట్టభద్రుడు కొట్నాక్ భీం రావ్ అయితే తొలి ఐఏఎస్‌గా తుకారాం అనేక మేటి సేవలందించి అందరిలో నిలిచిపోయాడు.

ఏడాది పొడుగునా పండుగలే…
ఆదివాసీల్లో పండుగలకు పబ్బాలకు ఎనలేని ప్రాధాన్యతనిస్తారు. ఊరు ఊరంతాపాల్గొని సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితతీగా వస్తో ంది. పోలాల అమావాస్యతో ప్రారంభమయ్యే పండుగలు 12 నెలల పాటు కనువిందు చేస్తాయి. దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే గుస్సాడి నృ త్యాలు ప్రసిద్ధిగాంచాయి. ఆదివాసీ ప్రాంతాల్లో జరిగే శుభ కార్యాలు, పెళ్లి ళ్లు భిన్నంగా ఉండి ప్రకృతితో ముడిపడి ఉండడంతో ఆలోచింపచేస్తాయి.

విద్యా, వైద్యం మెరుగుదలతోనే ఆదివాసీల మనుగడ: ఒక వైపు విద్యా, వైద్య రంగాల్లో మెరుగు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అడవి బిడ్డలకు అందడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన గ్రా మాలకు తాగు నీరు, విద్య, వైద్యం క్షేత్ర స్థాయిలో అందించిన నా డే మరింత ప్రగతి సాధ్యమవుతుందని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్ధాం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ దంపతులు ఇక్కడికి వచ్చి ఆదివాసీలతో శాశ్వతంగా బంధాన్ని పెనవేసుకున్నారు. ఇక్కడి ఆదివాసీల ప్రేమ ఆప్యాయతలకు ముగ్ధులై తన కుమారునికి గిరిజనుని పేరు పెట్టారు. వీరు ఆదివాసీల కోసం కృషి చేసినందుకు గాను హైమన్‌డార్ఫ్ దంపతుల విగ్రహాలు ఏర్పా టు చేసి చరిత్రలో చిర స్థాయిగా నిలచేలా చేశారు.

ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల జనాభా(2011) ప్రకారం)….
గోండులు 2,63,515 శాతం 53.15
కొలాంలు 38,176 (7.70)
మన్నెవార్‌లు 15,370 (3.10)
తోటిలు 2,231 (0.45)
ప్రధాన్‌లు 26,029 (5.25)
నాయకపోడ్‌లు5,206 (1.05)
ఎరుకలు1735 (0.35)
కోయ, ఇతర తెగలు
30,739 (6.20)