Thursday, April 25, 2024

భారత్‌లో పదిమందిలో ఒకరికి కేన్సర్

- Advertisement -
- Advertisement -

Cancer

డబ్లుహెచ్‌ఒ, ఐఎఆర్‌సి నివేదికలు వెల్లడి
ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి
2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు
పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు
మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్ కేసులు
మరో 20 ఏళ్లలో 60 శాతం పెరిగే ప్రమాదం

ఐక్యరాజ్యసమితి : భారత్‌లో 2018లో కొత్తగా 1.16 మిలియన కేసులు నమోదయ్యాయని, ప్రతిపది మంది భారతీయుల్లో ఒకరికి తన జీవితకాలంలో కేన్సర్ సంక్రమిస్తోందని ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) నివేదిక వెల్లడించింది. మంగళవారం ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) దాని ప్రత్యేక అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ (ఐఎఆర్‌సి) రెండు నివేదికలు విడుదల చేశాయి. ఒకటి ఈ వ్యాధిపై ప్రపంచ దేశాల అజెండా రూపొందించే లక్షంతో కూడుకున్నది కాగా, రెండవది కేన్సర్‌పై పరిశోధన, నివారణపై దృష్టి కేంద్రీకరించినది. 2018 లో భారత్‌లో కేన్సర్ ఎంత భారంగా తయారైందో అంచనాల బట్టి కొత్తగా తలెత్తిన కేన్సర్ కేసులు 1.16 మిలియన్ కాగా, 748,800 కేన్సర్ మరణాలు, భారత్ మొత్తం జనాభా 1.35 బిలియన్‌లో 2.26 మిలియన్ మందికి ఐదేళ్లపాటు సర్వసాధారణంగా కేన్సర్ కేసులు కనిపించినట్టు వెల్లడైంది.

ఆరు రకాల సర్వసాధారణ కేన్సర్ కేసులు

162, 500 రొమ్ము కేన్సర్ కేసులు, 120,000 నోటి కేన్సర్ కేసులు, 97,000 గర్భాశయ కేన్సర్ కేసులు, 68, 000 ఊపిరి తిత్తుల కేన్సర్ కేసులు, 57,000 ఉదర కోశ కేన్సర్ కేసులు, 57,000 కొలొరెక్టల్ కేన్సర్ కేసులు ఉ న్నాయి. దీంతోపాటు 49శాతం కొత్త కేసులు ఉన్నాయి. పురుషుల్లో 570,000 కొత్త కేన్సర్ కేసులు ఉన్నాయి. వీటిలో 92000 నోటి కేన్సర్, 49000 ఊపిరి తిత్తుల కేన్సర్, 39000 ఉదర కోశ కేన్సర్, 37000 కొలొరెక్టల్ కేసులు ఉన్నాయి. అన్నవాహిక కేన్సర్ కేసులు 45 శాతం వరకు అంటే 34000 కేసుల వరకు ఉన్నాయి. మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్ కేసులు నమోదు కాగా, 1,62,500 రొమ్ము కేన్సర్, 97000 గర్భాశయ కేన్సర్, 36000 జననేంద్రియ కేన్సర్, 28000 నోటి కేన్సర్, 20000 కొలొరెక్టల్ కేన్సర్ కేసులు ఉన్నాయి

పొగాకు సంబంధిత కేన్సర్ కేసులే ఎక్కువ

భారత్‌లో పొగాకు సంబంధ కేన్సర్ కేసులే ఎక్కువగా ఉన్నాయని నివేదిక వివరించింది. తల, మెడ కేన్సర్ కేసు లు ముఖ్యంగా నోటి కేన్సర్ పొగాకు వల్లే సంక్రమిస్తోం ది. పురుషుల్లో నోటి కేన్సర్, మహిళల్లో గర్భాశయ కేన్సర్ వ్యాపిస్తోంది. సామాజిక ఆర్థిక స్థితి చాలా తక్కువగా ఉన్న కుటుంబాల్లోనే ఈ కేన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. శరీరం బరువు ఎక్కువగా ఉన్నా ఊబకాయం ఉన్నా శారీరక శ్రమ అంతగా లేకున్నా ఎక్కడికీ కదలని జీవన విధానం వల్ల సామాజిక ఆర్థిక స్థితి బాగా ఉన్న కుటుంబాల్లో రొమ్ము కేన్సర్, కొలొరెక్టల్ కేన్సర్ దాపురిస్తున్నా యి. గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో ఆర్థిక సామా జిక స్థితులు బాగా వృద్ధి చెందడంతో జీవన విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. దాంతోపాటు సాంక్రమికేతర వ్యా ధులు విస్తరించాయి. అయితే కేన్సర్ నివారణ, నియంత్రణ వైద్యవిధానాలు అందుబాటులో తేడా కనిపిస్తోంది.

మరి 20 ఏళ్లలో 60 శాతం పెరిగే ప్రమాదం

ప్రపంచ వ్యాప్తంగా మరో 20 ఏళ్లలో 60 శాతం కేన్సర్ పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఈ ప్రమాదం తప్పదని హెచ్చరించింది. 15 శాతం కన్నా తక్కువ దేశాలు సమగ్ర కేన్సర్ చికిత్సా విధానాన్ని ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా అందుబాటు లోకి తెస్తున్నాయి. ప్రతి దేశం లోను కేన్సర్‌ను ముందుగానే గుర్తించే శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందితే ఆమేరకు వివిధ భాగస్వాములతో సమన్వయం రూపొందించుకుంటే వచ్చే దశాబ్దంలో కనీసం 7 మిలియన్ జీవితాలనైనా కాపాడుకోగలుగుతారని డబ్లుహెచ్‌ఒ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రియెసెస్ సూచించారు.

స్వల్పాదాయ దేశాల్లోనే పొగరాయుళ్లు ఎక్కువ

ప్రపంచ దేశాల్లో స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోనే 80 శాతం పొగరాయుళ్లు ఉన్నారని డబ్లుహెచ్‌ఒ వెల్లడించింది. రోజూ పొగతాగే వారు 64 శాతం మంది కేవలం 10దేశాల్లో ఉన్నారని, పొగరాయుళ్లలో మగరాయుళ్లు 50 శాతం మంది చైనా, భారత్, ఇండోనేసియా దేశాల్లో ఉన్నారని చెప్పింది. పొగాకు సంబంధ కేన్సర్ కేసులు 34 నుంచి 69 శాతం పురుషుల్లో కనిపించాయి. మహిళల్లో 10 నుంచి 27శాతం కనిపించాయి.

కొలొరెక్టల్, రొమ్ము కేన్సర్లు పెరుగుతున్నాయి. ఏటా 1.4 నుంచి 2.8శాతం వరకు రొమ్ము కేన్సర్ కేసులు పెరుగుతున్నా యి. అయితే భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో గర్భాశయ కేన్సర్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో కేన్సర్ నివారణ వేగంగా జరుగుతోంది. 2000 నుంచి 2015 మధ్య కాలంలో అత్యధిక ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాలు 20శాతం వరకు తగ్గినట్టు స్వల్పాదాయ దేశాల్లో 5 శాతం మాత్రమే మరణాలు తగ్గినట్టు ఐఎఆర్‌సి డైరక్టర్ జనరల్ చెప్పారు.

World Cancer Day 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News