Home తాజా వార్తలు బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ రద్దు

బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ రద్దు

 

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య ఈ రోజు జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే రద్దైంది. బ్రిస్టల్‌లో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఇప్పటీ వరకు నాలుగు మ్యాచుల ద్వారా శ్రీలంక 4 పాయింట్లు, బంగ్లాదేశ్ 3 పాయింట్లు సాధించాయి. కాగా, నిన్న(సోమవారం) సౌతాంప్టన్ వేదికగా క్షిణాఫ్రికా, విండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. అంతకుముందు పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే.

World Cup 2019: BAN vs SRL match called out due to rain