Home తాజా వార్తలు ప్చ్‌.. కనకరించని వరుణుడు: భారత్xకివిస్ మ్యాచ్ రద్దు

ప్చ్‌.. కనకరించని వరుణుడు: భారత్xకివిస్ మ్యాచ్ రద్దు

 

ట్రెంట్‌బ్రిడ్జ్‌: భారీ వర్షానికి మరో మ్యాచ్ రద్దైంది. ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్ప లేదు. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురుస్తుండటంతో టాస్ పడకుండానే మ్యాచ్ ను రద్దైంది.

మైదానం సిబ్బంది ఎన్నిసార్లు శ్రమించినా.. వరుణుడు పదేపదే ఆటంకం కలిగించడంతో ఇక మ్యాచ్‌ జరగడం కష్టమేనని భావించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు తలో ఒక పాయింట్ ఇచ్చారు. కాగా, ఈ మెగా టోర్నీలో ఇప్పటీకే మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దైయ్యాయి. దీంతో ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్ లు వర్షంతో రద్దైయ్యాయి. ఇక, ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

 

World Cup 2019: IND vs NZ match abandoned due to rain