Home తాజా వార్తలు స్మిత్ మా వాళ్లు ఓవర్ చేశారు… క్షమించండి: విరాట్

స్మిత్ మా వాళ్లు ఓవర్ చేశారు… క్షమించండి: విరాట్

Virat Kohli

 

లండన్: ఓవల్ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను భారత అభిమానులు వెక్కిరించారు. స్మిత్ టాంపరింగ్, స్మిత్ టాంపరింగ్ అని అరిచారు. దీంతో స్మిత్ కొంచెం సేపు అసౌకర్యానికి లోనయ్యారు. బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ అభిమానులను అలా అనొద్దని సైగలు చేశాడు. దీంతో అభిమానులు నోరు తెరువలేదు. కోహ్లీకి స్మిత్ చేయి అందించి అభినందించాడు. దీంతో అంతర్జాతీయ మీడియా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆస్ట్రేలియా మీడియా అయితే విరాట్ పొగిడింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడని అభినందించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ మీడియాతో మాట్లాడారు. స్మిత్‌ను హేళన చేసి భారతీయులు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని విరాట్ హెచ్చరించారు. అతను తప్పు చేశాడు శిక్ష అనుభవించాడు… జట్టు కోసం ఆడుతున్నాడని, అలాంటి వ్యక్తి కించపరచొద్దని సూచించారు. అభిమానులు తరఫున స్మిత్‌కు కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సెంచరీ చేసిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.

 

World Cup: Apology to Smith on behalf of crowd: Virat

 

World Cup: Apology to Smith on behalf of crowd: Virat