Friday, April 26, 2024

ప్రపంచ ఆర్థిక సదస్సు వాయిదా

- Advertisement -
- Advertisement -
World Economic Forum postponed
వేసవి ప్రారంభంలో జరిగే అవకాశం

జ్యూరిచ్: ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్లూఇఎఫ్) వార్షిక సదస్సు వాయిదా పడింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల వాయిదా వేస్తున్నట్టు డబ్లూఇఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్ నగరం దావోస్ పర్వతప్రాంతం క్లోస్టర్స్‌లోని రిసార్ట్‌లో జనవరి 1721 మధ్య సదస్సు జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ప్రతి ఏటా జరిగే డబ్లూఇఎఫ్ సదస్సుకు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, దేశాల అధినేతలు హాజరు కానుండటం తెలిసిందే. కొవిడ్ ఉధృతి తగ్గితే 2022 వేసవి ప్రారంభంలో నిర్వహించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. నిపుణుల సలహామేరకు భౌతిక హాజరీతో సదస్సు నిర్వహించడం తీవ్ర ఇబ్బందులతో కూడినదని భావించిన స్విస్ ప్రభుత్వం సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డబ్లూఇఎఫ్ ఆ ప్రకటనలో పేర్కొన్నది. వార్షిక సదస్సు వాయిదా పడినా వాణిజ్య, ప్రభుత్వ అధినేతల మధ్య డిజిటల్ సంభాషణలు జరుగుతాయని డబ్లూఇఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాజ్ స్క్వాబ్ అన్నారు. ప్రపంచ నేతలను త్వరలోనే ఒక చోటికి చేర్చేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News